Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జపాన్ ఓపెన్ సూప‌ర్‌ సిరీస్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్ర‌మ‌ణ‌

జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి ఒలింపిక్ గ్ర‌హీత సైనా నెహ్వాల్ నిష్క్ర‌మించింది. ఓపెనింగ్ రౌండ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి క‌రోలినా మారిన్ చేతిలో 21-16, 21-13 తేడాతో ఓడిపోయింది. మ‌రోప‌క్క పీవీ సింధు కూడా ఓడిపోవ‌డంతో జ‌పాన్ ఓపెన్ సిరీస్ భారత్‌ మ‌హిళ‌ల సింగిల్స్ మీద ఆశ‌లు కోల్పోవాల్సి వ‌చ్చింది. సైనా, క‌రోలినా వీరిద్ద‌రికీ ఈ ఏడాది పెద్ద‌గా క‌లిసి రాలేదు.

దీంతో ఈ ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్‌లో వీరిద్ద‌రూ పోటాపోటీగా త‌ల‌ప‌డ్డారు. చివ‌రికి విజ‌యం క‌రోలినాను వ‌రించ‌డంతో సైనా వెనుదిరగాల్సి వ‌చ్చింది. మ్యాచ్ ప్రారంభంలో సైనా మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. మొద‌టి గేమ్‌లో 11-9 పాయింట్ల‌తో సైనా ముందంజ‌లో ఉంది. కానీ ఒక్క‌సారిగా క‌రోలినా విజృంభించ‌డంతో సైనా ఓట‌మి పాల‌యింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌లు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.
saina
japan open
quarters
loss
carolina marin

More Telugu News